Hyderabad: ఏపీ ఎస్‌ఈసీ రమేష్‌కుమార్‌ భద్రతకు అవసరమైన ఆదేశాలు జారీ: మంత్రి కిషన్‌రెడ్డి

orders issued for ap sec protection says rameshkumara
  • ఆ లేఖ ఆయన రాసినట్టుగానే భావిస్తున్నాం
  • ఆ మేరకు అవసరమైన నిర్ణయాలు
  • అవసరమైతే లిఖితపూర్వక ఆదేశాలు
కేంద్ర హోంశాఖకు ఏపీ రాష్ట్ర ఎన్నికల అధికారి పేరుతో అందిన లేఖ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ రాసిందిగానే భావిస్తున్నామని, ఆ మేరకు ఆయనకు అవసరమైన భద్రత కల్పించాల్సిందిగా రాష్ట్ర డీజీపీకి సూచించినట్టు కేంద్ర హోంశాఖ సహాయ  మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

ఈ రోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఇది రాష్ట్ర ప్రభుత్వం అంతర్గత వ్యవహారమైనా అధికారులను బెదిరించినది నిజమైతే కనుక అది సరైన పద్ధతి కాదన్నారు. ప్రస్తుతం రమేష్‌కుమార్‌ హైదరాబాద్‌లో ఉన్నారని, ఆయనకు తగిన భద్రత ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కి వెళ్లినప్పుడు కూడా తగిన భద్రత కల్పించాలని ఏపీ సీఎస్‌కు సూచించామని తెలిపారు. అవసరమైతే లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేశారు.
Hyderabad
Kishan Reddy
AP SEC
protection

More Telugu News