Hyderabad: కరోనా ఎఫెక్ట్ ... హైదరాబాద్ లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల నిలిపివేత

No drunk and drive tests in hyderabad
  • ట్రాఫిక్ పోలీసుల తాత్కాలిక నిర్ణయం
  • మిగిలిన నిబంధనలు యథాతథంగా అమలు
  • కెమెరాలు గమనిస్తాయంటున్న పోలీసులు

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు తాత్కాలికంగా నిలిపి వేయాలని నిర్ణయించారు. తనిఖీల సందర్భంగా మిషన్ల ద్వారా వైరస్ ఒకరి నుంచి మరొకరికి చేరే అవకాశం ఉందన్న ఉద్దేశంతో వాహనదారుల ఆరోగ్యం దృష్ట్యా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నిఘా నేత్రాలు (సీసీ కెమెరాలు) వాహన చోదకులను గమనిస్తుంటాయని, నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

ఇదే సమయంలో పెండింగ్ చలానాల వసూళ్లపై దృష్టి పెట్టాలని అధికారులు నిర్ణయించారు. సిగ్నల్ జంపింగ్, హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తే సీసీ కెమెరాల ద్వారా పసిగట్టి వాహన చోదకులకు జరిమానాలు పంపుతుంటారు. ఈ విషయం చాలామంది వాహన చోదకులు గుర్తించరు. కొందరు గుర్తించినా గుర్తించనట్టు నటిస్తుంటారు. అటువంటి వారి నుంచి రావల్సిన జరిమానాలు ముక్కుపిండి వసూలు చేయాలని పోలీసులు నిర్ణయించారు.

Hyderabad
traffic police
Drunk Driving

More Telugu News