Rahmika Mandanna: నిర్మాతగా మారనున్న రష్మిక?

Sukumar Movie
  • వరుస విజయాలతో రష్మిక 
  • బన్నీ జోడీగాను దక్కిన ఛాన్స్ 
  • కెరియర్ తొలినాళ్లలోనే సాహసం  
కథానాయికగా వరుస అవకాశాలతో .. వరుస విజయాలతో రష్మిక మందన దూసుకుపోతోంది. 'సరిలేరు నీకెవ్వరు' .. 'భీష్మ' సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్న ఆమె, త్వరలో బన్నీ జోడీ కట్టనుంది. సుకుమార్ - బన్నీ కాంబినేషన్లోని సినిమాకి ఆమెనే కథానాయిక. యూత్ లో ఆమెకి గల క్రేజ్ కారణంగా, పారితోషికం విషయంలో నిర్మాతలు ఎంతమాత్రం వెనకడుగు వేయడం లేదని అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే రష్మిక నిర్మాతగా మారే ఆలోచన చేస్తున్నట్టుగా ఒక వార్త జోరుగా వినిపిస్తోంది. కథానాయికలు నిర్మాతలుగా మారడమనేది చాలా కాలం నుంచి వస్తున్నదే. అయితే అందులో సక్సెస్ అయినవాళ్లు చాలా తక్కువ. ఇక కొంత కెరియర్ ను చూసిన వాళ్లు నిర్మాతలుగా మారారే గానీ, ఆరంభంలోనే ఆ సాహసం చేయలేదు. అలాంటిది ఇప్పుడిప్పుడే కెరియర్ ఊపందుకుంటున్న సమయంలో రష్మిక ఈ నిర్ణయాన్ని తీసుకోవడం పట్ల, అంతా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Rahmika Mandanna
Allu Arjun
Sukumar Movie

More Telugu News