Nirbhaya convicts: అరగంటపాటు ఉరికొయ్యకు వేలాడిన నిర్భయ దోషులు.. చనిపోయినట్టు వైద్యుల నిర్ధారణ

Nirbhya convicts declared dead by doctor
  • శిక్ష అమలు తర్వాత ప్రొటోకాల్ అమలు
  • అరగంట తర్వాత కిందికి దించి పరీక్షించిన వైద్యులు
  • చనిపోయినట్టు నిర్ధారించాక పోస్టుమార్టానికి తరలింపు
నేరం జరిగిన ఏడేళ్ల తర్వాత నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలైంది. శిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో ఈ తెల్లవారుజామున తీహార్ జైలులో కట్టుదిట్టమైన చర్యల మధ్య దోషులకు ఉరిశిక్ష అమలు చేశారు. ప్రొటోకాల్ ప్రకారం.. దోషుల మృతదేహాలను అరగంటపాటు ఉరికొయ్యలకు అలాగే వేలాడదీశారు. ఆ తర్వాత వాటిని కిందికి దించారు. అనంతరం వాటిని పరీక్షించిన వైద్యులు.. దోషులు నలుగురు చనిపోయినట్టు నిర్ధారించారు. అనంతరం పోస్టుమార్టంకు తరలించారు.  

దోషులు చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఈ తెల్లవారుజామున 5:30 గంటలకు వారికి ఉరిశిక్ష అమలు చేశారు. ఒకే నేరానికి సంబంధించి ఒకేసారి నలుగురికీ మరణదండన అమలు చేయడం తీహార్ జైలులో ఇదే తొలిసారి. ఉరితీత అనంతరం నిర్భయ తల్లి మాట్లాడుతూ.. ఎట్టకేలకు తమకు న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు.
Nirbhaya convicts
Doctors
Tihar Jail
post mortem

More Telugu News