Jamia Nizamia: ‘కరోనా’ ఎఫెక్ట్​.. శుక్రవారం నమాజ్​ లు కుదించుకోవాలని జామియా నిజామియా ఫత్వా

  • ‘కరోనా’ నివారణకు ముందు జాగ్రత్త చర్యలు
  • ఫరజ్ తప్ప మిగిలిన నమాజ్ లు ఇళ్లల్లోనే చేసుకోవాలి
  • షబే మేరాజ్ రోజున ప్రదర్శనలు నిర్వహించొద్దు
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా హైదరాబాద్ కు చెందిన జామియా నిజామియా యూనివర్శిటీ స్పందించింది. ముస్లింలు శుక్రవారం రోజు చేసే నమాజ్ లు కుదించుకోవాలంటూ ఫత్వా జారీ చేసింది. ఫరజ్ తప్ప మిగిలిన నమాజ్ లు తమ ఇళ్లల్లోనే చేసుకోవాలని తెలిపింది. షబే మేరాజ్ రోజున ప్రదర్శనలు నిర్వహించవద్దని ఈ ఫత్వాలో పేర్కొంది. కాగా, ‘కరోనా’ నేపథ్యంలో తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు, ప్రార్థనా మందిరాలకు భక్తులు వెళ్లొద్దని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది.
Jamia Nizamia
university
Fatwa
Namaz
Corona Virus

More Telugu News