Pooja Hegde: సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లాలని పూజ హెగ్డే నిర్ణయం!

Pooja Hegde decides to self quarantine for 14 days
  • ప్రభాస్ తాజా చిత్రంలో నటిస్తున్న పూజాహెగ్డే
  • జార్జియాలో షూటింగ్ పూర్తి చేసుకుని తిరుగు పయనం
  • 14 రోజలు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటానని ప్రకటన
ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ముఖ్యంగా యూరప్ దేశాలు విలవిల్లాడుతున్నాయి. మన దేశంలో ఇప్పుడిప్పుడే వైరస్ పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాతే బయటకు పంపిస్తున్నారు. అనుమానం ఉన్న వ్యక్తులను క్వారంటైన్ కు తరలించి 14 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో కరోనా లక్షణాలు కనిపించకపోయినా 14 రోజుల పాటు ఇంట్లోనే స్వీయ నిర్బంధం విధించుకోవాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

ఈనేపథ్యంలో, టాలీవుడ్ నటి పూజ హెగ్డే 14 రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలని నిర్ణయించుకుంది. ప్రభాస్ తాజా చిత్రంలో పూజ నటిస్తోంది. షూటింగ్ కోసం జార్జియా వెళ్లిన పూజ అక్కడి నుంచి తిరుగుపయనమైంది. ఈ నేపథ్యంలో ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులకు ఈ విషయాన్ని వెల్లడించింది. భారత్ కు వచ్చిన వెంటనే తాను చేయబోయే పని... ఇంట్లో తనను తాను నిర్బంధించుకోవడమని చెప్పింది.
Pooja Hegde
Corona Virus
Self Quarantine
Tollywood

More Telugu News