Andhra Pradesh: ఏపీలో మరో కరోనా కేసు... లండన్ నుంచి వచ్చి, హైదరాబాద్, గుంటూరులో తిరిగిన యువకుడికి పాజిటివ్!

Another Corona Positive Case in Andhra Pradesh
  • ఢిల్లీ మీదుగా ఒంగోలు చేరుకున్న యువకుడు
  • ఇంటికి వచ్చిన నాలుగు రోజుల తరువాత లక్షణాలు
  • పాజిటివ్ రావడంతో రిమ్స్ ఐసోలేషన్ వార్డుకు తరలింపు
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడం తీవ్ర కలకలం రేపగా, ప్రభుత్వం మరింత అప్రమత్తం అయింది. ఒంగోలు నగరానికి లండన్ నుంచి వచ్చిన ఓ యువకుడికి కరోనా పాజిటవ్ వచ్చింది. ఆ యువకుడు, ఇండియాకు వచ్చిన తరువాత న్యూఢిల్లీ, హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లి రావడంతో అతను ఎవరెవరిని కలిశాడన్న విషయంపైనా అధికారులు ఆరా తీస్తున్నారు.

ఈ నెల 13న ఢిల్లీ మీదుగా ఒంగోలుకు వచ్చిన అతను, ఇంటికి చేరుకుని, రెండు రోజుల తరువాత హైదరాబాద్ వెళ్లాడు. అక్కడి నుంచి ఏసీ బస్సులో ఒంగోలుకు వచ్చాడు. గుంటూరుకు కూడా వెళ్లి వచ్చాడు. ఆపై అతనికి జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిలో చేర్చగా, వైద్యులు పరీక్షలు చేసి, కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు.

ఆపై అప్రమత్తమైన వైద్యులు రిమ్స్ లోని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్సను అందిస్తూ, కుటుంబ సభ్యులను పరిశీలనలో ఉంచారు. రోగి నివాసం ఉన్న ఒంగోలు, ముంగమూరు డొంక ప్రాంతంలోని మూడు కిలోమీటర్ల పరిధిలోని అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
Andhra Pradesh
Ongole
Corona Virus
Positive

More Telugu News