Kesineni Nani: కులగజ్జి నీకుందని అందరికీ ఆపాదిస్తే..: కేశినేని నాని

Kesineni Nani fires on Jagan over caste remarks on Nimmagadda Ramesh
  • దొంగే అందరినీ చూసి దొంగదొంగ అని అరిచినట్టుంది
  • ఎస్ఈసీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది
  • దీనికి ఏమంటారు జగన్ గారూ?
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్ కులం, టీడీపీ అధినేత చంద్రబాబు కులం రెండూ ఒకటేనని... అందుకే చంద్రబాబు సూచనల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలను ఆయన వాయిదా వేశారంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. కులగజ్జి నీకు ఉందని అందరికీ ఆపాదిస్తే... దొంగ అందరినీ చూసి దొంగదొంగ అని అరిచినట్టు ఉందని ఆయన విమర్శించారు. సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని సమర్థించిందని... దానికి ఏమంటావని ప్రశ్నించారు. దీనికి తోడు ఓ వార్తా పత్రికలో వచ్చిన 'వాయిదాను ఆపలేం' అనే కథనాన్ని షేర్ చేశారు.
Kesineni Nani
Chandrababu
Telugudesam
Jagan
YSRCP
Nimmagadda Ramesh
SEC
Supreme Court

More Telugu News