Nirbhaya: రేపు సూర్యోదయాన్ని చూసే అవకాశం లేని నిర్భయ దోషులు... ఉరి ఖాయమే!

  • తెల్లవారుజామున 5.30 గంటలకు శిక్ష అమలు
  • డమ్మీ ఉరి పరీక్షలు చేసిన తలారి
  • అక్షయ్ ఠాకూర్ నుంచి విడాకులు కోరిన భార్య
Nirbhaya Convicts Hang Tomorrow

ప్రస్తుతం తీహార్ జైల్లో ఉండి, తమకు విధించబడిన శిక్షను ఎలాగైనా తప్పించుకోవాలన్న ఉద్దేశంతో చేతనైనన్ని ప్రయత్నాలు చేస్తున్న నిర్భయ దోషులు, రేపు సూర్యోదయాన్ని చూసే అవకాశం లేదని జైలు అధికారులు అంటున్నారు. ఇప్పటికే వారి ముందున్న న్యాయపరమైన దారులన్నీ మూసుకుపోయాయని, ముందుగా షెడ్యూల్ చేసుకున్నట్టుగానే శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఉరి ఖాయమని వెల్లడించారు. ఇప్పటికే తలారి డమ్మీ ఉరి నిర్వహించి, తాళ్లను పరిశీలించారని తెలిపారు.

కాగా, తాజాగా నలుగురు దోషుల్లో ఒకరు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేయగా, కోర్టు దాన్ని కొట్టేసింది. మరో దోషి అక్షయ్‌ ఠాకూర్‌ భార్య తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ ఔరంగాబాద్‌ కోర్టులో కేసు వేయగా, దానిపై నేడు విచారణ జరుగనుంది. ఇక తీహార్ జైల్లో రేపు ఉదయం ఈ నలుగురికీ శిక్ష అమలు జరిగితే, అది చరిత్రలో నిలిచిపోతుంది. తీహార్ జైల్లో గతంలో పలువురికి ఉరిశిక్షను అమలు చేసినప్పటికీ, నలుగురు దోషులకు ఒకేసారి ఉరి వేయడం మాత్రం ఇదే తొలిసారి.

More Telugu News