Chilukuru: నేటి నుంచి చిలుకూరు దేవాలయం మూసివేత!

Chilukuru Temple Closed over Corona Fever
  • 25 వరకూ మూసివేత
  • విదేశీ భక్తులను గుర్తించే పరిస్థితి లేనందునే
  • వెల్లడించిన రంగరాజన్
నేటి నుంచి 25వ తేదీ వరకూ చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని మూసి వేస్తున్నట్టు ఆలయ అర్చకుడు రంగరాజన్‌ ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. భక్తులు స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఎక్కువ సమయం ఉంటారని, కొందరు భక్తులు విదేశాల నుంచి వచ్చి కూడా ప్రదక్షిణలు చేస్తుంటారని, వారిని గుర్తించే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Chilukuru
Balaji Temple
Closure

More Telugu News