Anand Mahindra: కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచన చేసిన ఆనంద్ మహీంద్రా!

Anand Mahindras Appeal To Government As Coronavirus Cases Near 150
  • కరోనా విస్తరించకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటోంది
  • వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్న రేటు మాత్రం తక్కువగా ఉంది
  • ఇందులో ప్రైవేట్ సెక్టార్ ను భాగస్వామిని చేయండి
భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు 150కి చేరువైన తరుణంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కీలక సూచన చేశారు. కరోనా వైరస్ టెస్టింగ్ ప్రక్రియలోకి ప్రైవేట్ సెక్టార్ ను కూడా అనుమతించాలని కోరారు. వైరస్ విస్తరించకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ... ఇతర దేశాలతో పోలిస్తే మన దేశం కరోనా పరీక్షలను తక్కువగా చేసిందని వ్యాఖ్యానించారు.

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం కోసం భారత్ చేస్తున్న కృషిని ఇతర దేశాలు కూడా అభినందించాయని ఆనంద్ మహీంద్రా చెప్పారు. కానీ మన టెస్టింగ్ రేట్ చాలా తక్కువగా ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు నిర్వహించే పరీక్షల సంఖ్యను పెంచడానికి ప్రైవేట్ సెక్టార్ ను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని కోరారు. కరోనా పరీక్షల నిర్వహణలో మన కెపాసిటీని పెంచుకోవడానికి ఈ పని చేయాలని అన్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ కు ట్విట్టర్ ద్వారా విన్నివించారు.
Anand Mahindra
Corona Virus
Testing
Private Sector

More Telugu News