Varla Ramaiah: జగన్ చేసిన వ్యాఖ్యలకు ప్రపంచమంతా నవ్వుకుంటోంది: వర్ల రామయ్య

Everyone laughing at Jagan over his comments on corona virus says Varla Ramaiah
  • కరోనా గురించి కనీస పరిజ్ఞానం కూడా లేకుండా జగన్ మాట్లాడారు
  • వైరస్ విషయంలో జగన్ ఇంకా మొద్దు నిద్రలోనే ఉన్నారు
  • ఎస్ఈసీ రమేశ్ ను కులం పేరుతో దూషించడం దారుణం
కరోనా వైరస్ గురించి ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలకు ప్రపంచమంతా నవ్వుకుంటోందని టీడీపీ నేత వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. వైరస్ గురించి కనీస పరిజ్ఞానం కూడా లేకుండా జగన్ మాట్లాడారని విమర్శించారు. కరోనా నేపథ్యంలో దేశమంతా అలర్ట్ అయిందని... జగన్ మాత్రం మొద్దు నిద్రలోనే ఉన్నారని దుయ్యబట్టారు.

 ఎస్ఈసీ రమేశ్ ను కులం పేరుతో దూషించడం అత్యంత దారుణమని మండిపడ్డారు. గతంలో అల్లర్లు పులివెందులకు మాత్రమే పరిమితమయ్యేవని... ఇప్పుడు రాష్ట్రమంతా విస్తరించాయని అన్నారు. పోలీసులు కూడా వైసీపీ కార్యకర్తల్లా పని చేస్తుండటం దారుణమని విమర్శించారు. జగనన్నకు గిఫ్ట్ ఇస్తామని కొందరు సీఐ స్థాయి అధికారులు బహిరంగంగానే ప్రకటించారని చెప్పారు.
Varla Ramaiah
Telugudesam
Jagan
YSRCP
SEC
Ramesh
Corona Virus

More Telugu News