K Kavitha: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు వెళ్తుండగా కవిత కాన్వాయ్‌లో ప్రమాదం

kavitha car accident
  • తుప్రాన్‌ వద్ద ప్రమాదం
  • ధ్వంసమైన జీవన్‌రెడ్డి కారు
  • ఆ సమయంలో అందులో లేని జీవన్‌రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత శాసన మండలి అభ్యర్థిగా నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయడానికి వెళ్తుండగా ఆమె కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ వెళ్తుండగా కాన్వాయ్‌ తుప్రాన్‌ వద్దకు చేరుకోగానే ముందు వెళ్తున్న ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కారును కాన్వాయ్‌లోని మరో కారు ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ ప్రమాదంలో ఆ ఎమ్మెల్యే కారు ధ్వంసమైంది. జీవన్‌రెడ్డి అందులో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తాను క్షేమంగానే ఉన్నానని జీవన్‌ రెడ్డి తెలిపారు.  
K Kavitha
Telangana
Nizamabad District

More Telugu News