West Godavari District: కొన ఊపిరితో గోదావరి నదిలో మహిళ.. రక్షించిన మత్స్యకారులు!

  • కొవ్వూరు శ్మశానవాటిక సమీపంలో ఘటన
  • ప్రమాదమా...ఆత్మహత్యా యత్నమా...హత్యా యత్నమా?
  • వివరాలు తెలియాల్సి ఉంది

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు శ్మశానవాటిక సమీపంలోని సుకర్యాంపు వద్ద గోదావరి నదిలో కొట్టుకుపోతున్న ఓ మహిళను అక్కడి మత్స్యకారులు రక్షించారు. ఈ రోజు ఉదయం స్థానిక మత్స్యకారులు తమ పడవకు మరమ్మతులు చేసుకుంటూ ఉండగా కొనఊపిరితో నదిలో కొట్టుకుపోతున్న మహిళ కనిపించింది. వెంటనే వారు నదిలోకి దూకి ఆమెను రక్షించి ఒడ్డుకు చేర్చారు. 

ఆమె ఎవరో, ఎందుకు నదిలో కొట్టుకుపోతోందో తెలియరాలేదు. ప్రమాద వశాత్తు నదిలో పడిపోయిందా, ఆత్మహత్యా యత్నం చేసిందా, లేక చంపేసేందుకు ఎవరైనా నదిలోకి తోసేశారా? అన్న రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆమె మాట్లాడే స్థితిలో లేకపోవడంతో వివరాలు తెలియాల్సి ఉంది.

West Godavari District
eluru
women
saved

More Telugu News