Donald Trump: తాను చేసిన 'చైనీస్ వైరస్' వ్యాఖ్యపై స్పందించి.. చైనాకు కౌంటర్‌ ఇచ్చిన ట్రంప్

trump on corona virus
  • కరోనా వ్యాప్తికి అమెరికాయే కారణమన్న చైనా ఆరోపణలు సరికాదు 
  • వైరస్‌ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ప్రాంతం పేరు పెట్టి పిలవడం తప్పుకాదు
  • కరోనా ‘చైనీస్ వైరస్‌’ అనేది సరైన పదమే
కరోనాను 'చైనీస్‌ వైరస్‌' అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ట్వీట్‌పై చైనా మండిపడ్డ విషయం తెలిసిందే. 'చైనీస్‌ వైరస్‌' ప్రభావం వల్ల నష్టపోతోన్న ఎయిర్‌లైన్స్‌ వంటి పరిశ్రమలకు అమెరికా పూర్తిగా సహకారం అందిస్తుందని, తిరిగి గతంలో ఎన్నడూ లేనంత బలంగా తాము తయారవుతామని ట్రంప్‌ అన్నారు. దీనిపై చైనా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో తాను చేసిన వ్యాఖ్యలపై ట్రంప్‌ మరోసారి స్పందిస్తూ తనను సమర్థించుకున్నారు.

కరోనా వ్యాప్తికి అమెరికాయే కారణమంటూ చైనా ఆరోపణలు చేయడం ఏ మాత్రం సరికాదని ట్రంప్ తెలిపారు. అమెరికా సైన్యం వల్లే వైరస్‌ చైనాకు పాకిందంటూ తప్పుడు ఆరోపణ చేశారన్నారు. ఆ వైరస్‌ ఎక్కడి నుంచి వ్యాప్తి అయిందో ఆ ప్రాంతం పేరు పెట్టి పిలవడం తప్పుకాదని తెలిపారు.

కరోనా ‘చైనీస్ వైరస్‌’ అనేది సరైన పదమేనన్నారు. తమ దేశం నుంచి చైనాకు ప్రయాణాలను నిషేధించి తాను మంచిపని చేశానన్నారు. దీనివల్ల ముడిసరకు దిగుమతుల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్న వాదనను ఆయన తిరస్కరించారు. చైనాకు తమ దేశ ఉత్పత్తుల అవసరం చాలా అవసరం ఉందని, దీంతో సత్సంబంధాలను చైనా కొనసాగిస్తుందని తెలిపారు.
Donald Trump
america
China

More Telugu News