Suresh Prabhu: స్వీయ నిర్బంధం విధించుకున్న బీజేపీ ఎంపీ

Suresh Prabhu under self quarantine
  • సౌదీ అరేబియాకు వెళ్లి వచ్చిన సురేశ్ ప్రభు
  • వైద్య పరీక్షల్లో కరోనా నెగెటివ్ అని నిర్ధారణ
  • నియంత్రణ చర్యల్లో భాగంగా స్వీయ నిర్బంధం
తన నివాసంలోనే స్వీయ నిర్బంధం విధించుకున్నట్టు బీజేపీ ఎంపీ సురేశ్ ప్రభు వెల్లడించారు. ఈ నేపథ్యంలో, తాను పార్లమెంటు సమావేశాలకు రాలేనని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి లేఖ రాశారు. త్వరలో జరగనున్న జీ20 సదస్సుకు సంబంధించి సౌదీ అరేబియాలోని అల్ ఖోబర్ లో మార్చి 10న నిర్వహించిన సమావేశానికి తాను హాజరయ్యానని... ముందు జాగ్రత్తగా చేయించుకున్న వైద్య పరీక్షలో కరోనా నెగెటివ్ వచ్చిందని లేఖలో ఆయన తెలిపారు.

అయినా, నియంత్రణ చర్యల్లో భాగంగా 14 రోజుల పాటు ఇంట్లోనే సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఈ కారణంగానే తాను పార్లమెంటు సమావేశాలకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు. కేంద్ర మంత్రి మురళీధరన్ కూడా తన నివాసంలో స్వీయ నిర్బంధం విధించుకున్న సంగతి తెలిసిందే.
Suresh Prabhu
BJP
Self Quarantine

More Telugu News