కరోనాకు ఆరు నెలల్లో ఔషధం... చేతులు కలిపిన సిప్లా, ఐఐసీటీ!
- మూడు మందులను తయారు చేసే పనిలో నిమగ్నం
- రసాయనాలు తయారు చేయనున్న ఐఐసీటీ
- వాటిని మాత్రల రూపంలోకి మార్చనున్న సిప్లా
ఈ ఔషధాలపై ఇప్పటికే రెండు క్లినికల్ ట్రయల్స్ ముగిశాయని, అయితే, కొన్ని కారణాల వల్ల వీటిని ఇంకా మార్కెట్లోకి వదిలే పరిస్థితి లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే, అత్యవసర పరిస్థితులు ఏర్పడితే, వీటిని నేరుగా రోగులకు వినియోగించవచ్చని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఈ మూడు రసాయనాలతో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు జరిగాయని, అయితే, పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయని ఈ మందులను నిశితంగా పరిశీలించి, వీటితో వైరస్ లను ఎదుర్కోవచ్చన్న అంచనాకు వచ్చామని ఆయన తెలిపారు.