Hyderabad: హైదరాబాద్‌లో దారుణం: విదేశాలకు వెళ్లొచ్చిన వృద్ధ దంపతులు.. కరోనా భయంతో అపార్ట్‌మెంట్ నుంచి గెంటివేత

Amid Corona fear apartment members vacate elder couple in Hyderabad
  • మూడు రోజుల క్రితం విదేశాల నుంచి వచ్చిన వృద్ధ దంపతులు
  • అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ అపార్ట్‌మెంట్ వాసుల ఒత్తిడి
  • గెంటేయడంతో రాత్రంతా అపార్ట్‌మెంట్ బయటే పడిగాపులు
కరోనా భయం దయాదాక్షిణ్యాలను కూడా దూరం చేస్తోంది. విదేశాలకు వెళ్లొచ్చిన వృద్ధ దంపతులను అపార్ట్‌మెంట్‌వాసులు నిర్దాక్షిణ్యంగా గెంటేశారు. హైదరాబాద్‌లోని అల్వాల్‌లో జరిగిందీ ఘటన. ఇక్కడి ఓ అపార్ట్‌మెంట్‌ సముదాయంలో మొత్తం 50 కుటుంబాలు నివసిస్తున్నాయి. అందులో ఓ అపార్ట్‌మెంట్‌లో వృద్ధ దంపతులు నివసిస్తున్నారు.

ఇటీవల వారు విదేశాలకు వెళ్లి మూడు రోజుల క్రితం తిరిగొచ్చారు. విదేశాల నుంచి వచ్చే వారికి కరోనా వైరస్ సోకే ఉంటుందన్న అనుమానంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ అపార్ట్‌మెంట్ వాసులు వారిపై ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించారు. నిన్న రాత్రి వారిపై మరింత ఒత్తిడి తీసుకురావడమే కాకుండా అపార్ట్‌మెంట్ నుంచి బయటకు గెంటేశారు. దీంతో వారు రాత్రంతా అపార్ట్‌మెంట్ బయటే గడిపారు.
Hyderabad
Corona Virus
apartment
elederly couple

More Telugu News