GHMC: ‘కరోనా’ ఎఫెక్ట్​.. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై జీహెచ్ఎంసీ చర్యలు!

  • జీహెచ్ ఎంసీ ఎన్ ఫోర్స్ మెంట్ బృందాల తనిఖీలు
  • ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన  66 సంస్థలు
  • ఆ సంస్థలను సీజ్ చేశామన్న జీహెచ్ఎంసీ ఈడీ విశ్వదత్
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండే నిమిత్తం విద్యా సంస్థలు, పబ్ లు తాత్కాలికంగా మూసివేయాలన్న ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన వాటిపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ ఎంసీ) ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతర్ చేసిన 66 సంస్థలను సీజ్ చేసినట్టు జీహెచ్ఎంసీ ఈడీ విశ్వదత్ పేర్కొన్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం తనిఖీలు నిర్వహించేందుకు 18 బృందాలు ఏర్పాటు చేశామని చెప్పారు. నిబంధనలు అతిక్రమించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘కరోనా’ నివారణకు ఆయా సంస్థల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని, తమ ఉద్యోగులకు మాస్క్ లు, గ్లౌజ్ లు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
GHMC
Hyderabad
Corona Virus
enforce ment
squad

More Telugu News