Atchannaidu: ప్రపంచమంతా కరోనా గురించి మాట్లాడుకుంటుంటే ఏపీలో పరిస్థితి మాత్రం విరుద్ధంగా ఉంది: అచ్చెన్నాయుడు

Atchannaidu slams AP government in the wake of corona
  • ఎన్నికల కమిషనర్ ను ఇష్టంవచ్చినట్టు తిడుతున్నారని ఆగ్రహం
  • కులం ప్రస్తావన తీసుకువచ్చారని విమర్శలు
  • కులం పేరుతో సీఎం విభేదాలు రాజేస్తున్నాడని ఆరోపణ
కరోనా ప్రభావంతో స్థానిక ఎన్నికలు వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్ ను సీఎం సహా వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 'మీరు చెప్పిన విధంగా షెడ్యూల్ విడుదల చేసినప్పుడు అతను మంచి ఎన్నికల కమిషనర్... ఎన్నికలు వాయిదా వేయగానే అతని కులం పేరుతో మాట్లాడుతున్నారు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రపంచమంతా కరోనా గురించి చర్చించుకుంటుంటే ఏపీలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని విమర్శించారు. ఏపీ సీఎం కులాల ప్రస్తావన తెస్తూ, ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. దేశంలోని ప్రముఖ ఆలయాలు కూడా కరోనా కారణంగా వెలవెలబోతున్నాయని, ఏపీలోనూ తిరుమల, దుర్గమ్మ ఆలయాలు బోసిపోయాయని, దీనిపై మంత్రి వెల్లంపల్లి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.
Atchannaidu
Jagan
Andhra Pradesh
Corona Virus
Telugudesam

More Telugu News