Chinna Jeeyar Swamy: భారతీయ సంప్రదాయాలతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది: చినజీయర్ స్వామి

Chinna Jeeyar Swamy says immunity increases with Indian traditions
  • యోగా, ధ్యానంతో కరోనాను అరికట్టవచ్చన్న చినజీయర్
  • వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో ముఖ్యమని వెల్లడి
  • జనసమూహాలకు దూరంగా ఉండాలని సూచన
దేశంలో కరోనా కలకలం నెలకొన్న నేపథ్యంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతీయ సంప్రదాయాలతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. యోగా, ధ్యానంతో కొంతవరకు కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రత వల్ల కరోనా బారినపడకుండా రక్షించుకోవచ్చని, జనసమూహాలకు దూరంగా ఉండడం అవసరమని సూచించారు. భారత్ లో అనేక రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ఉనికి చాటుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు భారత్ లో కరోనా కారణంగా ముగ్గురు ప్రాణాలు విడిచారు.
Chinna Jeeyar Swamy
Corona Virus
Indian Traditions
Immunity

More Telugu News