Vellampalli Srinivasa Rao: ఏపీ అభివృద్ధి చెందకూడదనే చంద్రబాబు, కన్నా, పవన్​ కుట్రలు: మంత్రి వెల్లంపల్లి

Minister Vellampally comments on chandrababu
  • ‘స్థానిక’ ఎన్నికల వాయిదాకు బాబు మొదటి నుంచి యత్నించారు
  • రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి పవన్ ఎందుకు మాట్లాడరు?
  • ఏపీకి రావాల్సిన నిధులను కన్నా, పవన్ ఇప్పించగలరా?
రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు వాయిదా వేయించాలని మొదటి నుంచి చంద్రబాబు ప్రయత్నించారని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్ సుపరిపాలన చూసి బాబు ఓర్వలేకపోతున్నారని, ఎన్నికలు ఎదుర్కోలేకనే బాబు కుట్ర చేశారని ఆరోపించారు. ఈసీని మేనేజ్ చేసే స్థాయికి చంద్రబాబు దిగజారిపోయారని, జగన్ పై కన్నా దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. షూటింగ్స్ చేసుకుంటూ ఎన్నికల రద్దు గురించి పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని ఘాటుగా విమర్శించారు.

రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి పవన్ ఎందుకు మాట్లాడరు? అని ప్రశ్నించారు. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదనే చంద్రబాబు, కన్నా, పవన్ కల్యాణ్ లు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఏపీకి రావాల్సిన నిధులను కన్నా, పవన్ ఇప్పించగలరా? రాష్ట్రాభివృద్ధి గురించి ఎప్పుడైనా కేంద్రంతో కన్నా మాట్లాడారా? ఏ మంచి చేసినా జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడమే ప్రతిపక్షాల పనిగా ఉందని దుయ్యబట్టారు.
Vellampalli Srinivasa Rao
YSRCP
Chandrababu
Telugudesam
Kanna Lakshminarayana
BJP
Pawan Kalyan
Janasena

More Telugu News