వచ్చే ఎన్నికల్లో 350 సీట్లు మావే.. జ్యోతిష్యుడు చెప్పాడు: అఖిలేశ్ యాదవ్
- విమానంలో నా చేయి చూసిన జ్యోతిష్యుడు చెప్పాడు
- బీజేపీ అబద్ధాలు చెప్పి 300 సీట్లు గెలిచింది
- అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన
బీజేపీ అబద్ధాలు చెప్పి 300 సీట్లు గెలవొచ్చేమో కానీ, తాము నిజాలు చెప్పి, కష్టపడి 351 సీట్లు సాధిస్తామని చెప్పుకొచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా కులగణన చేపడతామన్నారు. బీహార్ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదన్న అఖిలేశ్ యాదవ్.. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై చర్చిస్తున్నట్టు తెలిపారు. కాగా, 2017 ఎన్నికల్లో ఎస్పీ 47 స్థానాలకే పరిమితమైంది.