గవర్నర్‌తో ముగిసిన కీలక భేటీ.. కాసేపట్లో జగన్ మీడియా సమావేశం.. కీలక ప్రకటన?

  • తిరిగి తాడేపల్లికి జగన్
  • సీఎం క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం
  • స్థానిక సంస్థల ఎన్నికలపై గవర్నర్‌తో చర్చించిన జగన్‌
ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమావేశం ముగిసింది. సుమారు గంటపాటు చర్చలు జరిపిన అనంతరం ఆయన తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్లారు. కాసేపట్లో జగన్ మీడియా సమావేశం నిర్వహించి కీలక అంశాలపై ప్రకటనలు చేయనున్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

దీంతో ఈ విషయంపై గవర్నర్‌తో జగన్‌ ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. అలాగే, త్వరలో ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్‌ సమావేశాలపై గవర్నర్‌కు జగన్‌ పలు వివరాలు తెలిపినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై జగన్‌ అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాసేపట్లో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌ మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.


More Telugu News