Telangana: తెలంగాణ గవర్నర్ తమిళిసై గురించి అసభ్య పోస్టులు... సహాయ నటుడి అరెస్ట్!

Person Arrested in Tamilnadu over Posts on Telangana Governer
  • సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టినసాధిక్ భాషా
  • పరువుకు నష్టం కలిగించాడని పోలీసులకు ఫిర్యాదు
  • పరారీలో ఉండగా పట్టేసిన పోలీసులు
తెలంగాణా గవర్నర్‌, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ పై సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టిన తమిళ సహాయ నటుడు సాధిక్ భాషాను పోలీసులు అరెస్డ్ చేశారు. తిరువారూరు జిల్లా, మన్నార్‌గుడి, అరిసికడై వీధికి చెందిన సాధిక్‌ (39) గతంలో 'కలవాణి–2' సినిమాలో నటించాడు. మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇటీవల అతను తన ఫేస్‌ బుక్‌ ఖాతాలో తమిళిసై పరువుకు నష్టం కలిగించే విధంగా పోస్టులు చేశాడు.

ఇవి వైరల్‌ కావడంతో స్థానిక బీజేపి నేత రఘురామన్‌, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తుండగా, తిరుత్తురైపూండి సమీపంలోని కట్టిమేడులో అతను చిక్కాడు. తన అత్తగారింట్లో ఉన్న సాధిక్‌ బాషాను పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.
Telangana
Tamilisai Soundararajan
Facebook
Sadhik Basha

More Telugu News