BCCI: కరోనా కల్లోలంపై ఐపీఎల్ ఫ్రాంచైజీలతో సమావేశం నిర్వహించిన బీసీసీఐ

BCCI held meeting with IPL franchisee owners
  • భారత్ లో పెరుగుతున్న కరోనా వ్యాప్తి
  • ఐపీఎల్ ప్రారంభం వాయిదా వేసిన బీసీసీఐ
  • ముంబయిలో కీలక భేటీ
  • బీసీసీఐ నిర్ణయాన్ని స్వాగతించిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు
దేశంలో కరోనా దెబ్బకు క్రీడారంగం కూడా ప్రభావితమవుతోంది. ఇప్పటికే ఐపీఎల్ ప్రారంభం వాయిదా పడగా, టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన మిగిలిన రెండు వన్డేలు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో, ఐపీఎల్ ఫ్రాంచైజీలతో బీసీసీఐ సమావేశం నిర్వహించింది.

 ముంబయిలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానులు హాజరయ్యారు. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, ప్రేక్షకుల ఆరోగ్యం కోసం బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానులు స్వాగతించారు. కరోనాపై పోరులో భాగంగా బీసీసీఐ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర వ్యవస్థలతో కలిసి పనిచేస్తుందని బోర్డు వెల్లడించింది.
BCCI
IPL
Corona Virus
Mumbai
Franchise

More Telugu News