రంగారెడ్డి జిల్లాలో బాంబు కలకలం... పేలుడుతో ఉలిక్కిపడిన స్థానికులు!

రంగారెడ్డి జిల్లాలో బాంబు పేలుడు ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాసేపు ఆందోళనకు కారణమయ్యింది. జిల్లాలోని శివరాంపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో ఈరోజు ఉదయం భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడు ఘటన కారణంగా సమీపంలోని ఇళ్ల కిటికీల అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి.

ఊహించని ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడమేకాక భయాందోళనలకు కారణమైంది. ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితుల్లో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఓ కెమికల్‌ డబ్బా కారణంగానే ఈ పేలుడు జరిగి ఉండవచ్చునని ప్రాథమికంగా నిర్థారించారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


More Telugu News