Virat Kohli: కరోనా నేపథ్యంలో అభిమానులకు జాగ్రత్తలు చెప్పిన కోహ్లీ

Kohlis suggestions to his fans regarding corona virus
  • వైరస్ సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి
  • తర్వాత ఇబ్బంది పడటం కంటే నివారణ మేలు
  • మహమ్మారిపై కలసికట్టుగా పోరాడుదాం
దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో తన అభిమానులకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జాగ్రత్తలు చెప్పాడు. అందరూ అప్రమత్తంగా ఉండాలని, వైరస్ సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపాడు. కరోనా వచ్చిన తర్వాత ఇబ్బంది పడటం కంటే... ముందుగానే నివారణ చర్యలు తీసుకుంటే మేలని అన్నాడు. కరోనాపై అందరం కలసికట్టుగా పోరాడుదామని చెప్పాడు. మరోవైపు, కరోనా ప్రభావంతో పలు టోర్నీలు రద్దవుతున్న సంగతి తెలిసిందే. ఇండియా-దక్షిణాఫ్రికాల మధ్య జరగాల్సిన వన్డే మ్యాచ్ లు కూడా రద్దయ్యాయి. ఐపీఎల్ వాయిదా పడింది. జపాన్ లో ఒలింపిక్స్ జరగడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కోహ్లీ తన అభిమానులకు ట్విట్టర్ ద్వారా జాగ్రత్తలు చెప్పాడు.
Virat Kohli
Corona Virus
Team India

More Telugu News