Rajinikanth: ఆ విషయం ఆయనకే తెలియదు.. రజనీకాంత్‌పై కమెడియన్ వడివేలు సెటైర్లు

Kollywood comedian Vadivelu trolls Super Star Rajinikanth
  • ఆయన రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారో ఆయనకే తెలియదు
  • ఆయన సిద్ధాంతాన్ని మాత్రం స్వాగతిస్తున్నా
  • నాక్కూడా సీఎం కావాలన్న ఆశ ఉంది
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై ప్రముఖ కమెడియన్ వడివేలు సెటైర్లు వేశారు. తాజాగా తిరుచెందూరు సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించిన వడివేలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు వడివేలు స్పందిస్తూ.. రజనీకాంత్ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియదని, చివరికి ఆయనక్కూడా ఆ విషయం తెలియదని ఎద్దేవా చేశారు.

అయితే, పార్టీకి ఓ నాయకత్వం, పాలనకు మరో నాయకత్వం ఉంటుందన్న రజనీ సిద్ధాంతాన్ని మాత్రం తాను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. తనకు కూడా ముఖ్యమంత్రిని కావాలన్న ఆశ ఉందని, తాను నిలబడితే మీరు ఓటేస్తారా? అని విలేకరులను సరదాగా ప్రశ్నించారు. వారు వేస్తామని చెప్పడంతో, అయితే తాను సీఎం కావడం పక్కా అని నవ్వేశారు. తాను ప్రపంచ శాంతి కోసమే స్వామి వారిని దర్శించుకున్నట్టు వడివేలు చెప్పారు.
Rajinikanth
Tamil Nadu
Comedian
politics

More Telugu News