మీడియాకు 'ముఖం' చాటేసిన ట్వింకిల్ ఖన్నా.. వీడియో ఇదిగో!
- ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా
- ఇలా వెళ్లిపోయినందుకు మీడియా తన దైన శైలిలో స్పందిస్తుంది
- ఎందుకిలా చేశానన్న విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తా
తాను ఇలా చేయడం వెనక ఉన్న కారణం తెలిస్తే అందరూ షాక్ అవుతారని ట్వింకిల్ ఖన్నా చెప్పింది. ఎందుకిలా చేశానన్న విషయాన్ని తాను త్వరలోనే ప్రకటిస్తానని తెలిపింది. ఓ కొత్త పంథాకు తెరలేపానని చెప్పుకొచ్చింది. అది ఏమిటన్న విషయం తెలియాలంటే ఎదురు చూడాలని పేర్కొంది. ఆమె తీరుపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 50 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.