అలెర్ట్!.. దేశంలో తొలి కరోనా మరణం.. హైదరాబాద్‌లో కర్ణాటక వ్యక్తి మృతి

  • హైదరాబాద్‌లో 70 ఏళ్ల కర్ణాటక వ్యక్తి మృతి
  • కరోనాతో చనిపోయాడన్న కర్ణాటక మంత్రి
  • హైదరాబాద్ వాసుల్లో వణుకు
ఏదైతే జరగకూడదని జనం భయపడుతున్నారో.. అదే జరిగింది. దేశంలో తొలి  కరోనా మరణం సంభవించింది. హైదరాబాద్‌లో 70 ఏళ్ల కర్ణాటక వ్యక్తి మరణానికి కరోనానే కారణమని తేలింది. ఈ విషయాన్ని కర్ణాటక మంత్రి శ్రీరాములు వెల్లడించారు. అతడి మరణానికి కరోనానే కారణమని నిర్ధారణ అయినట్టు చెప్పారు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో కరోనా మరణం సంభవించడం నగర వాసులను భయభ్రాంతులకు గురిచేస్తోంది.

మరోవైపు, ఈ మహమ్మారి వెలుగుచూసిన చైనాలోని హుబేయి ప్రావిన్సులో కొత్త కేసుల నమోదు సింగిల్ డిజిట్‌కు పడిపోగా, చైనా వెలుపల మాత్రం ఇది విజృంభిస్తోంది. ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో కోరలు చాస్తోంది. కరోనా భయంతో ఇప్పటికే షెడ్యూల్‌లో ఉన్న కార్యక్రమాలన్నీ రద్దు అవుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 74 కేసులు నమోదయ్యాయి. దీంతో ఐపీఎల్ సహా ఇతర మ్యాచ్‌లను ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహించాలని బీసీసీఐ, ఇతర క్రీడా సమాఖ్యలకు కేంద్రం సూచనలు చేసింది.


More Telugu News