Yanamala: ఇలా అడ్డుకున్న ప్రతిచోట ‘స్థానిక’ ఎన్నికలు రద్దు చేయాలి: యనమల రామకృష్ణుడు

Yanamala Ramakrishnudu demands about local body polls
  • నామినేషన్లు వేయకుండా వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారు
  • ఈ విషయమై కోర్టులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలి
  • ఎన్నికల్లో గెలవలేమన్న భయం వైసీపీకి పట్టుకుంది
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఇలా అడ్డుకున్న ప్రతిచోట ఎన్నికలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై కోర్టులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని  కోరారు.

టీడీపీ నేతల నివాసాల్లో మద్యం సీసాలు పెట్టించి వారిపై అక్రమకేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో గెలవలేమన్న భయం వైసీపీకి పట్టుకుందని, అందుకే, తమ అభ్యర్థులను నామినేషన్లే వేయనీయకుండా చేస్తోందని ధ్వజమెత్తారు. నిన్న మాచర్లలో టీడీపీ నాయకుల పర్యటనపై విమర్శలు గుప్పించిన మంత్రి బొత్స సత్యనారాయణపై ఆయన మండిపడ్డారు. తమ నాయకుల పర్యటన గురించి ప్రశ్నించేందుకు ఆయన ఎవరు? అని ప్రశ్నించారు.
Yanamala
Telugudesam
Andhra Pradesh
YSRCP
Local Body Polls

More Telugu News