Parimal Nathwani: సీఎం జగన్ కు శుభాకాంక్షలు తెలిపిన పరిమళ్ నత్వానీ

Parimal Nathwani wishes CM Jagan on YSRCP Formation Day
  • నేడు వైసీపీ వ్యవస్థాపక దినోత్సవం
  • పార్టీకి 9 ఏళ్లు నిండాయన్న నత్వానీ
  • వైసీపీ ద్వారా రాజ్యసభకు వెళుతుండడాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు వెల్లడి
ఏపీ నుంచి రాజ్యసభ టికెట్ దక్కించుకున్న పరిమళ్ నత్వానీ తాజాగా ట్విట్టర్ లో స్పందించారు. నేడు వైసీపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నత్వానీ సీఎం జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. "ఇవాళ వైసీపీ డే సందర్భంగా సీఎం జగన్ కు నా బెస్ట్ విషెస్. నేటితో వైసీపీకి 9 ఏళ్లు నిండాయి. ఇప్పుడు నేను కూడా వైసీపీలో భాగం కావడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. రాష్ట్ర ప్రజలకు సేవలు అందించేందుకు సీఎం జగన్ తో కలిసి పనిచేస్తాను" అంటూ ట్వీట్ చేశారు.
Parimal Nathwani
Jagan
YSRCP
Formation Day
Rajya Sabha

More Telugu News