Kanna Lakshminarayana: ‘స్థానిక’ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తగినబుద్ధి చెప్పాలి: కన్నా లక్ష్మీ నారాయణ

Kanna Lakshminarayana criticises ysrcp government
  • బీజేపీ–జనసేన విజన్ డాక్యుమెంట్ విడుదల
  • ఏపీ ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి తగిన బుద్ధి చెప్పాలి
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం నియంతృత్వ పోకడ పోతోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. విజయవాడలో బీజేపీ–జనసేన ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా విజన్ డాక్యుమెంట్ ను కన్నా, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ లు ఆవిష్కరించారు.

అంతకుముందు కన్నా మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి తగిన బుద్ధి చెప్పాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థులను ఆదరించి గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంపై పోలీసులకు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదని విమర్శించారు.
Kanna Lakshminarayana
BJP
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News