Ramasubbareddy: చంద్రబాబు కారణంగానే పార్టీని వీడాల్సి వచ్చింది: రామసుబ్బారెడ్డి

Former minister Ramasubba Reddy made allegations on Chandrababu
  • పార్టీలో ఉండలేని పరిస్థితులు కల్పించారంటూ ఆరోపణలు
  • కార్యకర్తలు కూడా వైసీపీలో చేరాలని కోరారని వెల్లడి
  • తనపై వైసీపీ ఒత్తిళ్లు, బెదిరింపులు లేవని స్పష్టీకరణ

మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి నిన్న సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. టీడీపీని వీడి వైసీపీ వైపు రావడానికి గల కారణాలను రామసుబ్బారెడ్డి తాజాగా మీడియాకు వివరించారు. చంద్రబాబు పార్టీలో ఉండలేని పరిస్థితులు కల్పించారని, తానే కాకుండా అనేకమంది నేతలు పార్టీని వీడడానికి కారణం ఇదేనని అన్నారు. అంతేతప్ప, తనపై వైసీపీ ఒత్తిళ్లు, బెదిరింపులు లేవని స్పష్టం చేశారు. కార్యకర్తలు కూడా వైసీపీలో చేరాలంటూ ప్రోత్సహించారని రామసుబ్బారెడ్డి వెల్లడించారు. సీఎం జగన్ పరిపాలన తనను బాగా ఆకట్టుకుందని తెలిపారు.

  • Loading...

More Telugu News