Chandrababu: నామినేషన్ల దాఖలు గడువు పెంచమంటూ.. ఏపీ ఎన్నికల కమిషనర్‌కు చంద్రబాబు లేఖ

chandrababu writes letter to ec
  • రిటర్నింగ్‌ అధికారులు సకాలంలో నో డ్యూ పత్రాలు అందచేయలేదు 
  • నామినేషన్లు దాఖలు చేయకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకున్నారు
  • ఆధారాలను జతచేసిన చంద్రబాబు
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు పెంచాలని కోరారు. తమ నేతలకు రాష్ట్ర రిటర్నింగ్‌ అధికారులు సకాలంలో నో డ్యూ, కుల ధ్రువీకరణ పత్రాలు అందచేయలేదని ఆయన తెలిపారు.

అధికారులు అందుబాటులో లేని కారణంగా వాటిని ఇవ్వలేదని చంద్రబాబు చెప్పారు. నామినేషన్లు దాఖలు చేయకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకున్నారని, ఇందుకు కొందరు పోలీసులు కూడా సహకరించారని ఆయన ఆరోపించారు.

చాలా మంది అభ్యర్థులు సకాలంలో నామినేషన్లు వేయలేకపోయారని, దాదాపు 76 ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయని, ఇందుకు సంబంధించిన ఆధారాలను జతచేసి చంద్రబాబు లేఖ రాశారు. దీనిపై వెంటనే స్పందించాలని కోరారు.
Chandrababu
Telugudesam
Andhra Pradesh

More Telugu News