Dominar: 250 సీసీలో డోమినార్ ను తీసుకువచ్చిన బజాజ్

Bajaj launches new Dominar 250
  • ఇప్పటికే మార్కెట్లో బజాజ్ డోమినార్ 400
  • కుర్రకారు ఇష్టపడే హంగులతో నయా డోమినార్ 250
  • కేవలం పదిన్నర సెకన్లలో 100 కిలోమీటర్ల పికప్
దూరప్రయాణాలకు అనువైన రీతిలో బజాజ్ ఆటో సంస్థ ఇప్పటికే డోమినార్ 400 మోడల్ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా, డోమినార్ లో 250 సీసీ మోడల్ ను ప్రవేశపెట్టింది. ఇది బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా తయారైన బైక్. వేగాన్ని ఇష్టపడే కుర్రకారును దృష్టిలో ఉంచుకుని సరికొత్త డోమినార్ 250 బైక్ ను తీసుకువచ్చారు.

ఈ బైక్ కేవలం 10.5 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. అత్యధిక వేగం గంటకు 132 కిలోమీటర్లు. కొత్త డోమినార్ లో కన్సోల్ లో గేర్ పొజిషన్, టైమ్, ట్రిప్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇది కేవలం ఎరుపు, నలుపు రంగుల్లో అధీకృత బజాజ్ డీలర్ల వద్ద లభిస్తుందని, దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.1.60 లక్షలని కంపెనీ వర్గాలు తెలిపాయి.
Dominar
250 CC
Bajaj
Touring Bike

More Telugu News