Bonda Uma: పక్కా స్కెచ్ గీశారు.. బుద్ధా వెంకన్నను, నన్ను హత్య చేయాలని ప్లాన్ చేశారు: బోండా ఉమ

Bonda Uma describes Macherla attack incident
  • నిన్న రాత్రి వరకు మాచర్లకు వెళతామని మాకు తెలియదు
  • మాచర్లలో మా అభ్యర్థుల నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు
  • దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మాచర్ల వెళ్లాం
మాచర్లలో ఈరోజు జరిగిన సంఘటన రాష్ట్రంలోని ప్రజాస్వామ్య వాదులను కలవరపరిచిందని టీడీపీ నేత బోండా ఉమ అన్నారు. మాచర్లలో తాము ప్రయాణిస్తున్న వాహనంపై జరిగిన దాడి ఘటన గురించి వివరించారు. మంగళగరిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ సంఘటనకు కారణం ఏంటో, తాము ఎందుకు వెళ్లామో, ఎవరెవరు వెళ్లామో, అక్కడికి వెళ్లిన తర్వాత ఏం జరిగిందన్న వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఈరోజు పక్కాగా స్కెచ్ గీసి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను, తనను నడిరోడ్డుపై హత్య చేయాలని ప్లాన్ చేశారని ఆరోపించారు. నిన్న రాత్రి ఎనిమిది గంటల వరకు మాచర్లకు వెళతామన్న విషయం తమకు తెలియదని అన్నారు. మాచర్లలో నిన్న సాయంత్రం జరిగిన పరిణామాల విషయమై మాట్లాడేందుకు తమ అడ్వకేట్లను తీసుకుని వెళ్లామని చెప్పారు. టీడీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, భద్రత కల్పించాలని చెప్పేందుకు, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకే తాము వెళ్లామని చెప్పారు.
Bonda Uma
Telugudesam
Budda Venkanna
Macherla incident

More Telugu News