Revanth Reddy: కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ గా డీకే శివకుమార్ నియామకం... శుభాకాంక్షలు తెలిపిన రేవంత్

Revanth Reddy congratulates newly appointed KPCC chief DK Shivakumar
  • ట్రబుల్ షూటర్ గా గుర్తింపు తెచ్చుకున్న డీకే శివకుమార్
  • కేపీసీసీ చీఫ్ గా శివకుమార్ కు బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ హైకమాండ్
  • కంగ్రాచ్యులేషన్స్ శివకుమార్ అంటూ ఫేస్ బుక్ లో రేవంత్ పోస్టు
ఎక్కడ సమస్య ఉన్నా పరిష్కరించే దిట్టగా పార్టీ వర్గాల్లో గుర్తింపు దక్కించుకున్న సీనియర్ నేత డీకే శివకుమార్ కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ గా నియమితులయ్యారు. కేపీసీసీ చీఫ్ గా దినేశ్ గుండూరావు స్థానంలో కాంగ్రెస్ హైకమాండ్ డీకే శివకుమార్ కు బాధ్యతలు అప్పగించింది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ నేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులైన డీకే శివకుమార్ కు శుభాకాంక్షలు అంటూ ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. గతంలో తాను శివకుమార్ తో ఉన్న ఫొటోను పంచుకున్నారు.
Revanth Reddy
DK Shivakumar
Congress
Karnataka
KPCC

More Telugu News