Ayodhya Ramireddy: ఇది జగన్ ఎంతో ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం: అయోధ్య రామిరెడ్డి

Ayodhya Ramireddy praises CM Jagan over Rajyasabha members selection
  • రాజ్యసభకు నలుగుర్ని ఖరారు చేసిన వైసీపీ
  • చాన్స్ దక్కించుకున్న అయోధ్య రామిరెడ్డి
  • ఎంపిక విషయంలో జగన్ దార్శనికత కనిపిస్తోందని వ్యాఖ్యలు
ఏపీలో నలుగురు వైసీపీ రాజ్యసభ సభ్యులను పార్టీ అధినాయకత్వం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఆ నలుగురిలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కూడా ఉన్నారు. రాజ్యసభ సభ్యుల ఎంపికపై అయోధ్య రామిరెడ్డి తాజాగా స్పందించారు. తనను, పరిమళ్ నత్వానీని రాజ్యసభకు ఎంపిక చేసిన విషయంలో జగన్ దార్శనికత స్పష్టమవుతోందని పేర్కొన్నారు. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లను రాజకీయాల్లో వాడుకునే విధానం బాగుందని ప్రశంసించారు. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో ముందు చూపుతో కూడుకున్నదని కొనియాడారు.
Ayodhya Ramireddy
Rajya Sabha
YSRCP
Jagan
Andhra Pradesh

More Telugu News