Narendra Modi: మోదీ గారూ.. మీరు ఒక విషయాన్ని గుర్తించడం మర్చిపోయారు: రాహుల్ గాంధీ

Rahul Gandhi takes a swipe at Modi
  • ఓ ప్రభుత్వాన్ని కూల్చే పనిలో మీరు బిజీగా ఉన్నారు
  • చమురు ధరలు 35 శాతం తగ్గిన విషయాన్ని గుర్తించనట్టున్నారు
  • పెట్రోల్, డీజిల్ ధరలను రూ. 60 కంటే తక్కువకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరబోతున్నారు. దీంతో, మధ్యప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోబోతోంది. ఈ నేపథ్యంలో, ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.

'మోదీ గారూ.. ప్రజలు ఎన్నుకున్న ఓ ప్రభుత్వాన్ని కూల్చేపనిలో మీరు బిజీగా ఉన్నారు. ఈ బిజీలో పడి అంతర్జాతీయంగా చమురు ధరలు 35 శాతం పడిపోయాయనే విషయాన్ని గుర్తించకపోయి ఉండొచ్చు. చమురు ధరలు భారీగా తగ్గిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలను రూ. 60 కంటే తక్కువకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను కొంతైనా మెరుగుపరిచేందుకు యత్నించండి' అంటూ ట్వీట్ చేశారు.
Narendra Modi
BJP
Rahul Gandhi
Congress

More Telugu News