Navaratnalu: ధ్రువీకరణ పత్రాలపై నవరత్నాల ఫొటో!

navaratnala logo on revenue certificates
  • వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు 
  • ప్రభుత్వం జారీచేసే పత్రాలపై ఇదేం విధానమని ధ్వజం 
  • ప్రభుత్వ ఆదేశాలా...అధికారుల అత్యుత్సాహమా?

ప్రభుత్వం లోపాయికారీ ఆదేశాల మేరకు చేశారో లేక కొందరు అధికారులు అత్యుత్సాహంతో చేశారోగాని రెవెన్యూ అధికారులు జారీ చేస్తున్న కుల, ఆదాయ, నివాస, పుట్టిన తేదీ ధ్రువపత్రాలపై జగన్ ఫొటోతో ఉన్న నవరత్న పథకాల లోగో  ముద్రించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రభుత్వం ఇచ్చే ధ్రువపత్రాలపై ఇదేం విధానమని మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చే పార్టీలు మారుతుంటాయి, కానీ ప్రభుత్వం శాశ్వతమని, అటువంటప్పుడు ప్రభుత్వ లోగో కాకుండా ఇలా ముద్రించడం ఇదేం విధానమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందన ఏమిటో చూడాలి.

Navaratnalu
revenue certificates
logo
setairs

More Telugu News