Ashish Reddy: 'దిల్' రాజు సినిమా కోసం అనుపమ పరమేశ్వరన్ కి భారీ పారితోషికం

Huge fee to Anupama for Dil Raju Movie
  • నాలుగు భాషా చిత్రాలలో అనుపమ 
  • 'దిల్' రాజు నిర్మాణంలో మరో సినిమా 
  • హీరోగా ఆశిష్ రెడ్డి పరిచయం
తెలుగులో అనుపమ పరమేశ్వరన్ కి మంచి సినిమాలు పడ్డాయి. 'ప్రేమమ్' .. 'శతమానం భవతి' .. 'రాక్షసుడు' వంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి. ఒక వైపున తెలుగులో తనకి నచ్చిన కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే, మరో వైపున తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాలను కవర్ చేస్తోంది.

తాజాగా ఆమె తెలుగులో మరో సినిమాను అంగీకరించింది. 'దిల్' రాజు తన సోదరుడి తనయుడైన ఆశిష్ రెడ్డి హీరోగా ఒక సినిమాను నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకి 'రౌడీ బాయ్స్' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. కథానాయిక పాత్రకి అనుపమ అయితేనే పూర్తి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఆమెను తీసుకున్నారనేది తాజా సమాచారం. ఈ సినిమా కోసం అనుపమకి భారీ పారితోషికమే ముడుతున్నట్టు చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు.
Ashish Reddy
Anupama Parameshwaran
Dil Raju Movie

More Telugu News