Atchannaidu: జగన్ చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి పాడుపనులు: అచ్చెన్నాయుడు

Atchannaidu slams AP CM Jagan
  • జగన్ చెప్పేదొకటి, చేసేదొకటి అంటూ వ్యాఖ్యలు
  • మాట తప్పనన్నాడు, మడమ తిప్పనన్నాడు అంటూ విమర్శలు
  • జగన్ వ్యాఖ్యల క్లిప్పింగ్స్ ను ట్వీట్ చేసిన అచ్చెన్న
టీడీపీ సీనియర్ నేత కింజరాపు అచ్చెన్నాయుడు సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ తాజా పరిణామాలపై ఘాటుగా స్పందించారు. వైఎస్ జగన్ చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి పాడుపనులు అని విమర్శించారు. మాట తప్పనన్నాడు, మడమ తిప్పనన్నాడు. ప్రతి చోట, ప్రతిసారి ముందు చెప్పిందొకటి, తర్వాత చేసేదొకటి అంటూ ట్వీట్ చేశారు.

అంతేకాదు, పార్టీ ఫిరాయింపులపై గతంలో జగన్ సంతలో పశువుల్లా కొంటున్నారన్న వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్స్ ను కూడా అచ్చెన్న పోస్టు చేశారు. ఇటీవల టీడీపీ నుంచి పలువురు ప్రజాప్రతినిధులు వైసీపీలోకి వెళుతున్న నేపథ్యంలోనే అచ్చెన్న పై విధంగా స్పందించినట్టు తెలుస్తోంది.
Atchannaidu
Jagan
YSRCP
Telugudesam
Andhra Pradesh

More Telugu News