Hardik Pandya: కాబోయే భార్యతో హార్దిక్​ పాండ్యా హోలీ వేడుక

Hardik Pandya Celebrates Holi With Fiancee Natasa Stankovic and Family
  • తన ఇంట్లో హోలీ సంబరాలు చేసుకున్న హార్దిక్
  • అభిమానులకు శుభాకాంక్షలు తెలిపిన పాండ్యా బ్రదర్స్
  • దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వబోతున్న హార్దిక్
టీమిండియా స్టార్‌‌ ఆల్‌రౌండర్‌‌ హార్దిక్ పాండ్యా తనకు కాబోయే భార్య నటాషా స్టాంకోవిచ్‌తో కలిసి హోలీ పండుగ జరుపుకున్నాడు. నటాషాను తన ఇంటికి తీసుకెళ్లిన హార్దిక్.. అన్న కృనాల్ పాండ్యా, వదిన పంఖురితో కలిసి వేడుకల్లో పాల్గొన్నాడు. ఈ ఫొటోలను మంగళవారం తన ట్విటర్ అకౌంట్‌లో చేసిన పాండ్యా  ‘హ్యాపీ హోలీ ఫ్రమ్ పాండ్యాస్‌’అని క్యాప్షన్ ఇచ్చి అభిమానులకు హోలీ శుభాకాంక్షలు తెలిపాడు. ఆ వెంటనే ఫ్యాన్స్‌ ఈ ఫొటోలను షేర్ చేయడంతో పాటు పాండ్యాకు కూడా శుభాకాంక్షలు తెలిపారు.

గాయం కారణంగా  ఐదు నెలలుగా భారత జట్టుకు దూరంగా ఉన్నహార్దిక్ దక్షిణాఫ్రికాతో ఈనెల 12న మొదలయ్యే వన్డే సిరీస్‌తో పునరాగమనం చేయబోతున్నాడు. వెన్నుగాయానికి లండన్‌లో శస్త్రచికిత్స చేయించుకొని ఈ మధ్యే మళ్లీ కాంపిటీటివ్ క్రికెట్‌లో అడుగు పెట్టాడు. ముంబైలో డీవై పాటిల్‌ కప్‌లో రిలయన్స్‌ వన్ టీమ్‌ తరఫున బరిలోకి దిగిన హార్దిక్ రెండు మెరుపు శతకాలతో ఫామ్‌లోకి వచ్చాడు.
Hardik Pandya
Celebrates Holi
Fiancee Natasa Stankovic

More Telugu News