ఫారెస్ట్ ఆఫీసర్ గా విజయ్ సేతుపతి
- విజయ్ సేతుపతికి తమిళంలో మంచి క్రేజ్
- తెలుగు నుంచి వరుస అవకాశాలు
- సుకుమార్ మూవీలోను ముఖ్యమైన రోల్
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ స్మగ్లర్లకి సహకరించే లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రకి గాను విజయ్ సేతుపతిని ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన అవినీతి అధికారిగా కనిపిస్తాడా? సిన్సియర్ ఆఫీసర్ గా కనిపిస్తాడా? అనేది తెలియాల్సి వుంది. రష్మిక మందన కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ సంగీతాన్ని అందిస్తున్నాడు.