'లవ్ స్టోరీ' నుంచి సాంగ్ వచ్చేస్తోంది
- శేఖర్ కమ్ముల నుంచి 'లవ్ స్టోరీ'
- రేపు రానున్న లిరికల్ వీడియో
- అభిమానుల్లో పెరుగుతున్న అంచనాలు
'ఫిదా' తరువాత శేఖర్ కమ్ముల - సాయిపల్లవి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. ఇక 'మజిలీ' సక్సెస్ తరువాత చైతూ చేస్తున్న సినిమా ఇది. ఈ రెండు కారణాలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. శేఖర్ కమ్ముల గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా, అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేదిగా సాగుతుందని అంటున్నారు. ఈ సినిమాతో ఈ ముగ్గురికి హిట్ దొరుకుతుందేమో చూడాలి.