వైసీపీకి ప్రచారం చేసే గ్రామ వాలంటీర్లకు దేహశుద్ధి చేయండి: బుద్ధా వెంకన్న

Budda Venkanna comments on village volunteers
  • ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా పని చేయాలి
  • అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎంపిక చేసుకోవాలన్న వెంకన్న
  • వైసీపీకి గుణపాఠం చెప్పేందుకు కలసికట్టుగా పని చేయాలన్న అశోక్ బాబు
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా పని చేయాలని పార్టీ శ్రేణులకు టీడీపీ అర్బన్ అధ్యక్షుడు బుద్ధా వెంకన్న పిలుపునిచ్చారు. అభ్యర్థులను డివిజన్ కమిటీ నాయకులే ఏకగ్రీవంగా ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేసే గ్రామ వాలంటీర్లకు దేహశుద్ధి చేయాలని చెప్పారు. గవర్నర్ పేట లోని కేశినేని భవన్ లో బుద్ధా వెంకన్న అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోందని మరో నేత అశోక్ బాబు అన్నారు. వైసీపీకి గుణపాఠం చెప్పేందుకు టీడీపీ శ్రేణులంతా కలసికట్టుగా పని చేయాలని చెప్పారు.

మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ, టీడీపీని ఎదుర్కోలేకే ముఖ్యమంత్రి జగన్ కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైసీపీకి టీడీపీ శ్రేణులు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, నాగుల్ మీరా, గన్నే అన్న, మాజీ మేయర్ కోనేరు శ్రీధర్, డిప్యూటీ మేయర్ గోగుల రమణరావు, లింగమనేని శివప్రసాద్ తదితరులు హాజరయ్యారు.
Go Back to Shorts
Mandali Buddaprasad
Ashok Babu
Telugudesam
Vijayawada
Municipal Elections
YSRCP

More Telugu News