Sensex: కరోనా దెబ్బకు కుప్పకూలుతున్న మార్కెట్లు.. 2,300 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్ 

Sensex and Nifty collapses with corona virus fears
  • ఆర్థిక సంక్షోభంపై పెరుగుతున్న భయాలు
  • కుదేలవుతున్న జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లు
  • 15 శాతానికి పైగా నష్టపోయిన ఓఎన్జీసీ
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచమంతా విస్తరిస్తోంది. దీని దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోతుందనే భయాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ, దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి.

సెన్సెక్స్ ఏకంగా 2,316 పాయింట్లు పతనమై 35,260 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 643 పాయింట్లు కోల్పోయి 10,346 వద్ద కొనసాగుతోంది. అన్ని సూచీలు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఎనర్జీ సూచీ 10 శాతానికి పైగా పతనమైంది. బ్యాంకెక్స్, ఇన్ఫ్రా, మెటల్ షేర్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నారు. ఓఎన్జీసీ 15.09 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 12.92 శాతం పతనమయ్యాయి.
Sensex
Nifty
Stock Market

More Telugu News