Twitter: నన్ను క్షమించండి.. మీ భార్యను కౌగిలించుకున్నాను: ప్రిన్స్‌ హ్యారీకి లేఖ రాసిన బాలుడు

Schoolboy Pens Hilarious Letter To Prince Harry After Hugging Meghan Markle
  • స్కూల్‌కి వెళ్లి మాట్లాడిన మేఘన్‌ మార్కెల్‌
  • పాఠశాల విద్యార్థి మాట్లాడాక హగ్‌ ఇచ్చిన యువరాణి
  • ఆమెను చూడగానే భావోద్వేగానికి లోనయ్యానన్న బాలుడు
  • తనకే ఈ ఘటన షాకింగ్‌గా ఉందని లేఖ
బ్రిటన్‌ యువరాజు ప్రిన్స్‌ హ్యారీ భార్య మేఘన్‌ మార్కెల్‌ను ఓ పాఠశాల విద్యార్థి కౌగిలించుకున్నాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లండన్‌లోని ఓ స్కూల్‌ను మేఘన్‌ మార్కెల్  సందర్శించారు. విద్యార్థుల్లో ఎవరైనా ఉమెన్స్‌ డే ప్రాధాన్యత గురించి మాట్లాడాలని ఆమె చెప్పారు. మాట్లాడడానికి అందరూ భయపడుతుండగా ఎకర్‌ ఒకోయి అనే విద్యార్థి మాట్లాడాడు. మొదట మేఘన్‌ మార్కెల్‌ చాలా అందంగా ఉందని చెప్పాడు.

అతడు మాట్లాడాక మేఘన్‌ అతడిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంది. అనంతరం ఇంటికి వెళ్లింది. దీంతో మేఘన్‌ మార్కెల్‌ భర్త ప్రిన్స్‌ హ్యారీకి ఆ బాలుడు ఓ లేఖ రాశాడు. 'నేను మీ భార్యను కౌగిలించుకున్నందుకు మీరేమీ అనుకోవద్దు.. నన్ను క్షమించండి. ఆమెను చూడగానే భావోద్వేగానికి లోనయ్యాను' అని తెలిపాడు. తనకే ఈ ఘటన షాకింగ్‌గా ఉందని చెప్పాడు.  
Twitter
Viral Videos

More Telugu News